కాపు రిజర్వేషన్లను కూడా కేంద్రం తొక్కిపెట్టింది

కాపు రిజర్వేషన్లపై కేంద్రంతో టీడీపీ ఎంపీలు చర్చిస్తారని డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. గురువారం  మాట్లాడుతూ త్వరలో రిజర్వేషన్లపై సంబంధిత మంత్రులతో ఏపీ బృందం చర్చిస్తుందన్నారు. అన్ని హామీల్లానే కాపు రిజర్వేషన్లను కూడా కేంద్రం తొక్కిపెట్టిందని ఆయన విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై జగన్ యూటర్న్ తీసుకున్నారని, పవన్ ఇంకా ఏం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. ముద్రగడ చిత్తశుద్ది ఉన్న టీడీపీకి మద్దతిస్తున్నారన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని చినరాజప్ప పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here