శ్రీవారిని దర్శించుకున్న కేటీఆర్ కుటుంబం

0
106

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య స్వామివారిని దర్శించుకుని.. అనంతరం మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత జేఈవో శ్రీనివాసరాజు కేటీఆర్ కొడుకు హిమన్షును స్వామివారి పట్టువస్ర్తాలతో సత్కరించి.. స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.స్వామివారి దర్శనం కోసం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here