పుట్టపర్తి సాయిబాబా వేషధారణలో ఎంపీ శివప్రసాద్

0
101

ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంటులో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఎంపీ శివప్రసాద్ ఈరోజు వినూత్న వేషధారణలో నిరసన తెలిపారు. పుట్టపర్తి సత్యసాయి బాబా వేషధారణలో పార్లమెంటుకు చేరుకున్న ఎంపీ శివప్రసాద్ టీడీపీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సత్యము, ధర్మము, న్యాయము వంటి మానవతా విలువలు లేని వ్యక్తి మోదీ అంటూ శివప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. అన్న సత్యవాక్కు విస్మరించి మోదీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నాడంటూ మోదీపై ఎంపీ శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here