చందనా బ్రదర్స్‌తో ఒప్పందం రద్దు

0
133

వక్ఫ్‌బోర్డు ఆస్తులు పెంచేందుకే జామా మసీదు ఆస్తులు లీజుకిచ్చామని వక్ఫ్‌బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ వివరణ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కారణాలతో కొందరు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. వేలంలో అధికంగా కోడ్‌ చేసినవారికే లీజుకిచ్చామని తెలిపారు. తాను ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని జలీల్‌ఖాన్ సవాల్ విసిరారు. వక్ఫ్‌ బోర్డుకు ప్రభుత్వం నుంచి నిధులు రావని, తామే సమకూర్చాలని తెలిపారు. చందనా బ్రదర్స్‌తో ప్రస్తుతం చేసుకున్న ఒప్పందం రద్దు చేస్తున్నామని, మళ్లీ బహిరంగ వేలం నిర్వహిస్తామని జలీల్‌ఖాన్ వెల్లడించారు. ఓ సంస్థకు కారు చవకగా జూమ్మా మసీదు ఆస్తులు కట్టబెట్టారని ఆరోపిస్తూ విజయవాడలో సీపీఐ, జనసేన పార్టీ నేతలు వేర్వురుగా ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here