తొలి త్రైమాసిక ఫలితాలు ఇచ్చిన ప్రోత్సాహంతో రిలయన్స్ ఇండస్ట్రీ షేరు ఆల్టైమ్ గరిష్టానికి చేరింది. ఇంట్రాడేలో రెండున్నర శాతం లాభపడి 1157 స్థాయికి చేరి సరికొత్త రికార్డు ఆర్ఐఎల్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడేలో నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ప్రస్తుతం ఒకశాతం లాభంతో రూ. 1139 వద్ద ట్రేడవుతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ ఎనలిస్టుల అంచనాలను అధిగమిస్తూ 8శాతం నికరలాభాన్ని నమోదుచేసింది. ఆర్ఐఎల్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మొదటి త్రైమాసికంలో రూ.6.12బిలియన్ల ఆదాయాన్ని సాధించింది.