2019లో వైసీపీ క్లీన్ స్వీప్

0
282

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని కమేడియన్, ’30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’గా గుర్తింపు తెచ్చుకున్న పృధ్వీరాజ్ జోస్యం చెప్పారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఢిల్లీలో ఆప్ సాధించినంతటి ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంతం చేసుకోనుందని వ్యాఖ్యానించారు. కావాలంటే ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చని అన్నారు. తన అనుచరులు, ఇతర నేతలు చెప్పే మాటలు, సలహా, సూచనలను వైఎస్ జగన్ పట్టించుకోరని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. జగన్ ను దగ్గర నుంచి చూసిన తనకు ఆయన మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసునని చెప్పారు. గతంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ పాప్యులారిటీని చూసి, మొత్తం ప్రభుత్వం రంగంలోకి దిగి విజయం కోసం శ్రమించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. పృధ్వి ఇంటర్వ్యూను మీరూ చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here