ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త..

0
166

భారత దేశంలోనే మూడో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణమైన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్)లో ఆర్టీసీ అధికారులు సరికొత్త మార్పులు చేసారు. ఈ బస్టాండ్ నుండి దేశంలోని వివిధ నగరాలకు, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఎన్నో వందల బస్సులు రోజు రాకపోకలు సాగిస్తుంటాయి అనే సంగతి తెల్సిందే.. దాదాపు ఈ బస్ స్టాండ్ లో 70కిపైగా ప్లాట్‌ఫారాలలో 70కి పైగా బస్సులు ఒకేసారి నిలబడే సామర్థ్యం ఉంది.

తాజాగా ఈ బస్సులు నిలిచే ప్లాట్‌ఫారాల నంబర్లను అధికారులు మార్చారు. ఇవాళ్టి నుంచి కొత్త ప్లాట్‌ఫారాల నంబర్లు అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఎక్కడెక్కడ ఏయే బస్సులు ఆగుతాయి.. ప్లాట్‌ఫారాల నంబర్లు ఏంటి అనేది మీకు తెలియజేస్తున్నాం..తప్పక తెలుసుకోగలరు.

ప్లాట్‌ఫారం 1-5: గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల, అమరావతి, ఐరావత్‌ బస్సులు
ప్లాట్‌ఫారం 6, 7: బెంగళూరు వెళ్లే టీఎస్‌ఆర్టీసీ బస్సులు
ప్లాట్‌ఫారం 8: బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు
ప్లాట్‌ఫారం 9: అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు
ప్లాట్‌ఫారం 10, 11: ఖమ్మం, భద్రాచలం, మణుగూరు బస్సులు
ప్లాట్‌ఫారం 12: సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం బస్సులు
ప్లాట్‌ఫారం 13: కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్‌ బస్సులు
ప్లాట్‌ఫారం 14, 15: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు
ప్లాట్‌ఫారం 16, 17: గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట బస్సులు
ప్లాట్‌ఫారం 18-22: యాదగిరిగుట్ట, వరంగల్‌ బస్సులు
ప్లాట్‌ఫారం 23: శ్రీశైలం బస్సులు
ప్లాట్‌ఫారం 24, 25: అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
ప్లాట్‌ఫారం 27-31: మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ బస్సులు
ప్లాట్‌ఫారం 32-34: నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌
ప్లాట్‌ఫారం 35, 36: విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
ప్లాట్‌ఫారం 37, 38: విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
ప్లాట్‌ఫారం 39: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
ప్లాట్‌ఫారం 40: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
ప్లాట్‌ఫారం 41, 42: గద్వాల్‌, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
ప్లాట్‌ఫారం 43-45: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
ప్లాట్‌ఫారం 46-47: మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ బస్సులు
ప్లాట్‌ఫారం 48-52: జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరాడ్‌, షోలాపూర్‌, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు
ప్లాట్‌ఫారం 53-55: సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్‌, మంచిర్యాల, అసీఫాబాద్‌ బస్సులు
ప్లాట్‌ఫారం 56-58: నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగ్‌పూర్‌, అమరావతి బస్సులు
ప్లాట్‌ఫారం 59-61: మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు
ప్లాట్‌ఫారం 62: దేవరకొండ బస్సులు
ప్లాట్‌ఫారం 63-65: పరిగి, వికారాబాద్‌, తాండూరు బస్సులు
ప్లాట్‌ఫారం 66-75: ఎలైటింగ్‌ పాయింట్లు
ప్లాట్‌ఫారం 76-79: సిటీ సర్వీస్‌ బస్సులు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here