తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఆగస్టులో కొన్ని రోజులపాటు నిలిపివేయాలని టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా తప్పుపట్టారు. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రమణదీక్షితులు చెప్పిన మాటలు నిజమవుతాయన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసే అధికారం టీటీడీ పాలకమండలికి లేదని అన్నారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే భక్తులతో కలిసి ఉద్యమిస్తామని రోజా అన్నారు. మహా సంప్రోక్షణ పేరుతో 9 రోజులు ఆలయాన్ని మూసివేయాలని, భక్తులు రావద్దని నిబంధలు పెడుతున్నారంటే అసలు రమణదీక్షితులు చెప్పింది నిజమవుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని, అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోడానికి వీళ్లు ఎవరని రోజా ప్రశ్నించారు.