“ఈ నగరానికి ఏమైంది” మూవీ రివ్యూ …

0
148
సంస్థ‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్
న‌టీన‌టులు: విష్వ‌క్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభిన‌వ్ గొమ‌టం, వెంక‌టేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్‌, సిమ్ర‌న్ చౌద‌రి, గీతా భాస్క‌ర్ దాస్యం త‌దిత‌రులు
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌తా త‌రుణ్ దాస్యం
కెమెరా: నికేత్ బొమ్మి
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
ఎడిటింగ్‌: ర‌వితేజ గిరిజాల‌
సౌండ్ డిజైన్‌: సంజ‌య్ దాస్ బిట్ల‌, వ‌రుణ్ వేణుగోపాల్‌
నిర్మాత‌: డి.సురేశ్ బాబు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: వెంక‌ట్ సిద్ధారెడ్డి
కో ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: శ్రీనివాస్ కౌశిక్‌
ద‌ర్శ‌క‌త్వం: త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం
క‌థ‌:
విష్వ‌క్సేస్ నాయుడు (వివేక్‌), సుశాంత్ రెడ్డి (కార్తిక్‌), అభిన‌వ్ గొమ‌టం (కౌశిక్‌), వెంక‌టేశ్ కాకుమాను (ఉప్పు) స్నేహితులు. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి చ‌దువుకుంటారు. షార్ట్ ఫిల్మ్ తీయాల‌న్న‌ది గోల్‌. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే వివేక్ ప్రేమ‌లో ప‌డతాడు. అత‌నికున్న భ‌యాన్ని చూసి అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ బ్రేక‌ప్ చెబుతుంది. దాంతో తాగుడుకు బానిసై క‌ర్త‌వ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు వివేక్‌. వీరంద‌రికీ దూరంగా వెళ్లి కార్తిక్ ఓ పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకునే ప‌నిలో ఉంటాడు. కౌశిక్ డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, ఉప్పు ఎడిట‌ర్‌గా ఉద్యోగాలు చేస్తుంటారు. త‌న‌కు పెళ్లి కుదిరిన సంద‌ర్భంగా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాడు కార్తిక్‌. ఆ పార్టీలోనే రింగు పోగొట్టుకుంటాడు. తాగిన మ‌త్తులో ఉన్న ఫ్రెండ్స్ అక్క‌డి నుంచి గోవాకు చేరుకుంటాడు. ఖ‌రీదైన రింగు కొన‌డం కోసం వారు చేసిన ప్ర‌య‌త్నాలు ఏంటి? మ‌ర‌లా షార్ట్ ఫిల్మ్ చేయ‌డానికి వారికి స‌హ‌క‌రించింది ఎవ‌రు? చివ‌రికి తీశారా? లేదా? వ‌ంటివ‌న్నీ సెకండాఫ్‌లో చూడాల్సిందే.
విశ్లేష‌ణ‌:
రొటీన్‌గా ఓ ల‌వ్ స్టోరీ, నాలుగు పాట‌లు, నాలుగు ఫైట్లు, ప్రీ క్లైమాక్స్, అదిరిపోయే ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, కొన్ని న‌వ్వులు… ఇలాంటి ఫార్ములాకు దూరంగా సాగే సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది?`. అనుకున్న క‌ల‌ల‌ను సాకారం చేసుకునే ప‌నిలో ప‌డ్డ న‌లుగురు కుర్రాళ్లు, వాళ్ల‌ల్లో ఒక‌రికి రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్‌, ఒక‌రికి ల‌వ్ ప్రాబ్ల‌మ్‌.. ఇంకో ఇద్ద‌రు మామూలుగా ఉంటారు. ఏదో చేద్దామ‌ని, డ‌బ్బు కోసం.. డాబు కోసం ఇంకేదో చేయాల‌నుకున్న ఒక ఫ్రెండ్ మ‌న‌సులో ఉన్న విష‌యాన్ని గ్ర‌హించిన మ‌రో ఫ్రెండ్‌.. అత‌ని క‌ల సాకారం అయ్యే ద‌శ‌గా అడుగులు వేయించిన తీరు, యువ‌త స‌ర‌దాగా మందు కొట్టిన‌ప్పుడు వారు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో చూపించిన స‌న్నివేశాలు, క‌ష్టాల‌న్నిటినీ ప‌క్క‌న‌పెట్టి క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ స‌న్నివేశాలు, న‌లుగురు కుర్ర‌కారు కూర్చుని మాట్లాడుకుంటే చాటుగా మ‌నం విన్న‌ప్పుడు ఎలాంటి డైలాగులు వినిపిస్తాయో అలాంటి డైలాగులు… మేన‌మామ తండ్రిలాంటి వాడే అయినా, మేన‌ల్లుడికి ఒక ర‌కంగా స్నేహితుడిలాంటి వాడు అని చూపించే షాట్లు… జీవితం ఎక్క‌డా ఆగిపోదని, కావాల్సిన నాలుగు మెతుకులు, మ‌న అనుకున్న న‌లుగురు స్నేహితులు, న‌చ్చిన ఉద్యోగం, ఎదురుప‌డితే న‌వ్వుతూ ప‌ల‌క‌రించే న‌లుగురు ఆప్తులు అని చెప్ప‌క‌నే చెప్పిన సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది?`. స‌న్నివేశాల్లో కామెడీ పంచ‌డం కోసం తాగుడు స‌న్నివేశాల‌ను రాసుకుని, దానికి జ‌స్టిఫికేష‌న్ ఇవ్వ‌డానికి `ఈ న‌గ‌రానికి ఏమైంది` అని టైటిల్ పెట్టాడు త‌రుణ్ భాస్క‌ర్‌. క‌థ‌గా ఈ సినిమాలో చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా ఏమీ లేక‌పోయినా, ఇది… కొత్త‌ది అని చెప్పేంత‌గా లేక‌పోయినా, స‌న్నివేశాల‌ను, కామెడీని చ‌క్క‌గా రాసుకున్నారు త‌రుణ్‌.
తొలి చిత్రంలోలాగా ఈ సినిమాలోనూ సింక్ సౌండ్ చేశారు. టెక్నిక‌ల్‌గా అత‌ని గ‌త సినిమాక‌న్నా ఈ సినిమా బావుంది. వివేక్ సాగ‌ర్ సౌండ్ బావుంది. క్లైమాక్స్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌న్నివేశాన్ని లింక్ చేసిన తీరు బావుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లుగా వెళ్లి స‌ర‌దాగా చూసే చిత్ర‌మ‌వుతుంది.
ప్లస్ పాయింట్లు
– న‌టీన‌టుల న‌ట‌న‌
– కామెడీ
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
– టెక్నిక‌ల్ టీమ్ వ‌ర్క్
మైన‌స్ పాయింట్లు
– అక్క‌డ‌క్క‌డ సాగ‌దీత‌
– ప్రేమ స‌న్నివేశాలు మిస్ కావ‌డం
– స‌హజ‌త్వానికి దూరంగా ఉన్న‌ట్టు అనిపించ‌డం
తాజావార్తలు రేటింగ్ : 2.5/5 .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here