తెలుగు వెబ్ సైట్లకు గుడ్ న్యూస్ …

2
134

తెలుగు వెబ్ సైట్ల నిర్వాహకులకు మంచి శుభ వార్త . ఇక పై ప్రాంతీయ భాషలకూ వాణిజ్య ప్రకటనలు ఇవ్వనున్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది . ఇప్పటికే హిందీ , బెంగాలీ , తమిళ బాషల ఇప్పటికే ఈ వెసులుబాటు ఉండగా ఇప్పుడు తెలుగుకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది . ఈ నిర్ణయంతో తెలుగు డిజిటల్ మీడియా నిర్వాహకులకు అదనంగా రాబడి వచ్చే అవకాశం . గూగుల్ యాడ్సెన్స్ , యాడ్ వర్డ్స్ ద్వారా ప్రకటనలు ఇచ్చే వారికి కూడా దీనివల్ల ప్రయోజనం కలగనుందని గూగుల్ దక్షిణాసియా , భారత్ ఉపాదాక్ష్యుడు రాజన్ ఆనంద్ తెలిపారు .

బుధవారం ఆయన “గూగుల్ ఫర్ తెలుగు ” కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు . తెలుగులో వెబ్సైట్లు నిర్వహిస్తున్న వారు యాడ్సెన్స్ లోకి లాగిన్ అవ్వడం ద్వారా ప్రకటనలు పొందవచ్చన్నారు . ప్రాంతీయ భాషల్లో ఇంటర్నెట్ ఆధారంగా ఆదాయం పొందాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశం అని పేర్కొన్నారు.

ప్రస్తుతం భారతీయ భాషల్లో వెబ్‌సైట్లు చూస్తున్న వారి సంఖ్య 23.4కోట్లకు చేరుకుందని మార్కెట్‌ సొల్యూషన్స్‌-ఇండియా డైరెక్టర్‌ శాలినీ గిరీశ్‌ పేర్కొన్నారు . 2021 నాటికి వీరి సంఖ్య 53.6కోట్లకు చేరే అవకాశం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

2 COMMENTS

  1. Nagendra babu darivemuls

    Super news friends

    • Tajavarthalu Team

      Thank you nagendra babu , pls follow our site and support us

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here