మరో సారి పోలీసులకు పట్టుపడ్డ యువ నటుడు …

0
176

తమిళ్ సినీ నటుడు జై మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ మెయిన్ రోడ్డులో అధిక ధ్వనితో సైరన్ మోగించుకుంటూ వెళ్లడంతో ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు . దీంతో ఆ ప్రాంత ట్రాఫిక్‌ పోలీసులు జై కారును వెంబడించి అడ్డుకున్నారు . కారులో ఉన్న జైతో పోలీసులు మాట్లాడుతూ అధిక ధ్వనితో హారన్‌ మోగించడం నేరమని, ఆస్పత్రి సమీపంలో శబ్దం చేసుకుంటూ వెళితే రోగులు, వృద్ధులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సూచించారు . ధ్వని కాలుష్యానికి కారణమైన వారిపై తీసుకునే చర్యల గురించిన అవగాహన వీడియోను చూపించారు . దీంతో నటుడు జై ఇకపై అలా చేయనని సారీ చెప్పడంతో పోలీసులు హెచ్చరించి వదిలేశారు .

జై 2014 ఏప్రిల్ 13 న చెన్నై లోని కేకే నగర్ సమీపంలోని కాశి థియేటర్ ప్రాంతంలో మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టాడు . అలాగే 2017 సెప్టెంబర్ 21 న మద్యం మత్తులో అతి వేగంగా కారును నడుపుతూ అడయార్ బ్రిడ్జి సమీపంలో గోడను ఢీకొట్టాడు . ఈ కేసులో పోలీసులు అతనికి జరిమానా విధించి ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here