హన్సిక తో మరోసారి అంటున్న నితిన్

0
101

ప్రస్తుతం శ్రీనివాస కల్యాణం అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఇందులో హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తోంది. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మేటర్ ఇది కాదు. నితిన్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ సంగతి.

అవును… త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. ఇందులో హీరోయిన్ గా హన్సికను తీసుకున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో సీతారాముల కల్యాణం లంకలో అనే సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు, దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత నితిన్-హన్సిక కలిసి వర్క్ చేయబోతున్నారు.

ఛలో ఫేం వెంకీ కుడుముల డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. వచ్చేనెలలో సినిమాను ప్రారంభించి, ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here