ధోనీ జనరేషన్ లో పుట్టడం నా దురదృష్టం …

0
271

భారత జట్టులో మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడంతోనే..టీమిండియాలో తన స్థానాన్ని మహేంద్రసింగ్‌ ధోనీకి కోల్పోయినట్లు అప్పటి వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వెల్లడించాడు . ధోనీ కంటే ముందే భారత జట్టు తరఫున వికెట్ కీపర్లుగా ఆడిన పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్ ఆ తర్వాత దాదాపు దశాబ్దకాలం మళ్లీ జట్టు దరిదాపుల్లోకి రాలేకపోయారు . వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ తన మార్క్ కీపింగ్, బ్యాటింగ్‌తో తిరుగులేని కెప్టెన్‌గా ధోనీ ఎదిగారు .

దీంతో.. భారత సెలక్టర్లు మరో వికెట్ కీపర్‌ గురించి ఆలోచించే అవసరమే లేకపోయింది . కానీ 2014లో టెస్టులకి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ తర్వాత టీమిండియాలోకి వృద్ధిమాన్ సాహా, పార్థీవ్ పటేల్‌, దినేశ్ కార్తీక్‌ల పునరాగమనానికి మార్గం సుగుమమైంది. తాము మెరుగ్గా ఆడలేకపోవడంతోనే ధోనీ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్థీవ్ పటేల్ వెల్లడించాడు .

‘నాతో చాలా మంది చెప్తుంటారు , ధోనీ పుట్టిన తరంలో పుట్టడం నా దురదృష్టమని. కానీ ధోనీ కంటే ముందే నేను భారత జట్టులో ఆడాను. అక్కడ నేను బాగా ఆడింటే ధోనీని జట్టులోకి తీసుకొచ్చేవారు కాదు కదా.? కాబట్టి నేను ఆ మాటల్ని పట్టించుకోలేదు . జట్టులో చోటు కోల్పోవడానికి కారణంగా అత్యుత్తమంగా ఆడలేకపోవడమే . నా ఈ స్థితికి ఒకరిని విమర్శించడం కంటే ధోనీ తరంలో పుట్టడం నా పొరపాటు అని సర్దిచెప్పుకోవడం బాగుంటుంది . ధోనీ ఓ లెజెండ్’ అని పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటనకు బయల్దేరింది . తొలుత ఐర్లాండ్ పర్యటన కోసం ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటన కోసం శనివారం టీమిండియా బయల్దేరింది . ఈ సుదీర్ఘ సిరిస్‌లో భాగంగా కోహ్లీసేన తొలుత జూన్ 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది . ఇందుకోసం భారత జట్టులోని ఆటగాళ్లు ఐర్లాండ్‌ పర్యటనకు బయల్దేరారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here