మీకు ఎంత కట్నం వస్తుందో తెలుసా …

0
208

మార్కెట్లో ఏ వస్తువు రేటు ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇంటర్నెట్‌ని ఆశ్రయిస్తాం. ఎన్నో కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొచ్చి ఇంట్లో నుంచే అన్ని విషయాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అలాగే, డౌరీ క్యాల్క్యూరేటర్‌ డాట్‌ కామ్‌ (dowrycalculator.com) అంటూ ఓ వెబ్‌సైట్‌ ఉంది. పెళ్లికి కట్నం తీసుకోవడం అనేది ఓ దురాచారమే కాక చట్టరీత్యా నేరమన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కట్నం తీసకోకుండా పెళ్లి చేసుకునే వారు చాలా అరుదు.

ఈ విషయాన్నే క్యాష్‌ చేసుకుంటూ ఈ వెబ్‌సైట్‌… మీరు పెళ్లీడుకి వచ్చారా?  మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? మీకు వచ్చే కట్నం ఎంతో తెలుసా? అంటూ అబ్బాయి వయసు, కులం, ఉద్యోగం వంటి విషయాలు అడిగి అతడు పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం ఎంతో చెప్పేస్తోంది. ఆ తరువాత అధికంగా కట్నం లాగడానికి పలు సలహాలు కూడా ఇస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here