ఇదో కక్ష సాధింపు: సీఎం సిద్దరామయ్య

0
149
ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు కాంగ్రెస్‌ నేతలు టార్గెట్‌గా పెట్టుకుని ఐటి దాడులు జరిపిస్తున్నారని బాగల్కోటె జిల్లా ముథోళలో సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులే వారికి టార్గెట్‌ అన్నారు. పార్టీ అభ్యర్థు లు, వారి ముఖ్య అనుచరులను బెదరించేందుకే ఐటి దాడులు చేస్తున్నారన్నారు. ఇదో కక్షసాధింపు రాజకీయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ సునామీ తెర లేసిందని అమిత్‌షా చెప్పుకోవలసినదేగానీ ఇక్కడ ఏం జరగదని ఎద్దేవా చేశారు.
అమిత్‌షా నాటకాలు ఆడడంలో అబద్దాలు చెప్పడంలో దిట్ట అన్నారు. అమిత్‌షా, బీజేపీ నేతలకు సామాజిక న్యా యంపై నమ్మకం లేదని, బసవణ్ణపై గౌరవం లేదని కూడలసంగమకు వెళ్ళినా అందుకే బసవణ్ణ ఐక్యమంటపాన్ని సందర్శించలేదన్నారు. యడ్యూరప్పకు చెక్‌ రూపంలో లం చం తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు చెప్పా రా..? అంటూ ప్రశ్నించారు. నన్ను జైలుకు పంపేందుకు ముందు వాళ్ళు వెళ్ళి రావాల్సి ఉంటుందన్నారు. చాముండేశ్వరిలో బీజేపీ, జేడీఎ్‌సల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. గ్రామపంచాయతీలో గెలవలేని వ్యక్తికి బీజేపీ అభ్యర్థిగా మార్చిందంటే అర్థం చేసుకో వచ్చు నన్నారు. బాదామిలో 5వ తేదీ మాత్రమే ప్రచారం చేస్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here