ఆ ఇద్దరూ మెచ్చుకోవడం ఆనందాన్ని ఇచ్చింది: కొరటాల శివ

0
125
  • ‘భరత్’ చూసి కేటీఆర్ నాకు ఫోన్ చేశారు
  • కథను చాలా బాగా డీల్ చేశారు అన్నారు
  • జయప్రకాశ్ నారాయణగారు మెచ్చుకున్నారు

కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘భరత్ అనే నేను’ మహేశ్ బాబుకు భారీ విజయాన్ని కట్టబెట్టింది. ఆయన అభిమానులకు సంతోషాన్నీ .. సంతృప్తిని ఇచ్చింది. ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన సందేశాత్మక చిత్రం కావడం వలన, సినీప్రముఖులతో పాటు .. రాజకీయ ప్రముఖులు కూడా కొరటాలను ప్రశంసించారు.

తాజాగా కొరటాల మాట్లాడుతూ .. ” ఈ సినిమా చూసిన వెంటనే కేటీఆర్ గారు నాకు ఫోన్ చేశారు. ఇలాంటి కథా వస్తువును ఎంచుకున్నప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా అది డాక్యుమెంటరీ అయిపోతుంది. అలా కాకుండా కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ చాలా బాగా డీల్ చేశారు” అన్నారు. “ఇక జయప్రకాశ్ నారాయణగారు సాధారణంగా సినిమాలు చూడరు .. కానీ ఆయన ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి అభినందించారు. ఈ ఇద్దరి అభినందనలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి” అని చెప్పుకొచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here