మహానటిగా ఒదిగిపోయిన కీర్తి సురేష్…

0
181
కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం “మహానటి”. లెజండరీ కథానాయక అయిన సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రతిదీ సెన్సేషన్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని కీర్తి బ్లాక్ అండ్ వైట్ పిక్‌కి అలాగే ఉన్న సావిత్రి పిక్‌ను జత చేస్తూ చిత్రబృందం మరో పిక్‌ను వదిలింది. సావిత్రి పిక్‌తో పోల్చి చూస్తే కీర్తి పర్ఫెక్ట్‌గా సావిత్రిలా సరిపోయింది. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here