దేశ వ్యాప్తంగా 4జీ సేవలు ప్రారంభించనున్న బీఎస్‌ఎన్‌ఎల్!

0
106
  • వెల్లడించిన సంస్థ చైర్మన్  అనుపమ్ శ్రీవాత్సవ
  • ఇప్పటికే  కర్ణాటక,కేరళ రాష్ట్రాలలో 4జీ సేవలు
  • రూ.20 నామమాత్రపు చార్జితో  4జీ సిమ్‌ గా  అప్‌గ్రేడ్ చేసుకోవలి

బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 4జీ సేవలు ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా 21 ప్రాంతాలలో 4జీ సేవలను అందిచనున్నట్లు ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. వినియోగదారులు తమ 2జీ, 3జీ సిమ్ కార్డులను రూ.20 నామమాత్రపు చార్జితో 4జీ సిమ్‌ గా అప్‌గ్రేడ్ చేసుకోవలసి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here