షూటింగు దశలో ‘డ్రైవర్ రాముడు’ .. హీరోగా షకలక శంకర్

0
122
  • ‘డ్రైవర్ రాముడు’గా షకలక శంకర్
  • దర్శకుడిగా రాజ్ సత్య
  • ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి

హాస్య నటులుగా మంచి గుర్తింపు వచ్చేశాక, హీరోలుగా ప్రయత్నించడమనేది చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మానందం .. అలీ .. సునీల్ కూడా అదే మార్గాన్ని అనుసరించారు. ఇక శ్రీనివాస్ రెడ్డి .. సప్తగిరి అదే బాటలో ప్రయాణం చేస్తున్నారు. తాజాగా షకలక శంకర్ కూడా హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
ఆయన హీరోగా రాజ్ సత్య దర్శకత్వంలో ‘డ్రైవర్ రాముడు’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుని … హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడవ షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఒక పాటతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఇక హీరోగా ఈ సినిమా షకలక శంకర్ ను ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here