వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్ సభలో మాట్లాడారు!: గల్లా జయదేవ్‌కి జనసేన చురక

0
107
  • ఇప్పుడు ప్రత్యేక హోదాపై మౌనం పాటిస్తున్నారు
  • కారణమేంటో తెలుగు ప్రజలకు తెలుసు
  • ప్రత్యేక హోదా తెచ్చే మార్గాలను ఆలోచించండి మాస్టారు

వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. జగన్, పవన్‌.. ప్రధాని మోదీని ఎందుకు నిలదీయడం లేదని గల్లా జయదేవ్‌ ఈ రోజు అన్నారు. అలాగే రెండు రోజుల క్రితం ట్వీట్ చేస్తూ మోదీ- షా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో జగన్, పవన్ టైటిల్‌తో కొత్త సినిమా రాబోతుందని పేర్కొన్నారు. గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన పార్టీ తమ స్పందనను ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ చురకలంటించింది.
‘వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్ సభలో ప్రత్యేక హోదాపై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా జయదేవ్‌ గారూ.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా.. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. ప్రత్యేక హోదా తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు’ అని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here