ధోనీ సేనకు శుభవార్త!

0
118
వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో శుభవార్త. తండ్రి అకాల మరణంలో ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి సొంత దేశానికి పయనమైన దక్షిణాఫ్రికా ఆటగాడు లుంగి ఎంగిడి తిరిగి భారత్ వచ్చి జట్టులో చేరాడు. ఏప్రిల్ 13న ఎంగిడి తండ్రి జిరోమ్ మరణించారు. వార్త తెలిసిన వెంటనే ఎంగిడి దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు. స్వదేశం వెళ్లిన ఎంగిడి తిరిగి భారత్ రాకపోవచ్చని, మొత్తం టోర్నీకే దూరమవుతాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు తప్పని నిరూపించే ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత్ వచ్చిన ఎంగిడి జట్టుతో కలిసి పుణెలో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఐపీఎల్‌లో భాగంగా నేడు పుణెలో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నైఎంగిడి చేరికతో మరింత బలపడింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన ఒక్క ఓటమి, ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here